![]() |
![]() |
.webp)
టాలీవుడ్ స్టార్ సింగర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతామాధురి మరో సారి అమ్మ కాబోతోంది. త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆల్రెడీ గీతా-నందు జంటకు దాక్షాయనిప్రకృతి అనే కూతురు ఉంది. ఫిబ్రవరిలో దాక్షాయనికి తోడుగా ఓ బుజ్జాయి రాబోతోందని డిసెంబర్‌లో చెప్పింది గీతా మాధురి. తాజాగా ఆమెకు సీమంతం జరిగింది. కుటుంబ సభ్యులు, గీత ఫ్రెండ్స్, వెల్ విషర్స్ మధ్య ఈ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. అందమైన పట్టు చీరలో మెరిసిపోయింది గీతా మాధురి. సీమంతం చేసే వేదికను కూడా అందంగా ముస్తాబు చేసారు. ప్రస్తుతం ఈ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సెకండ్ సీజన్‌లో గీతా మాధురి రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
గీత, నందుది లవ్ మ్యారేజ్ అన్న విషయం అందరికీ తెలుసు 2014లో వీళ్ళ మ్యారేజ్ కూడా పెద్దల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. నందు కూడా మూవీస్ లో, వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఢీ షోకి హోస్ట్ గా చేస్తున్నారు అలాగే క్రికెట్ కామెంటేటర్ గా ఉన్నారు. రీసెంట్ గా నందు నటించిన మ్యాన్షన్ 24, వధువు వెబ్ సిరీస్ లు మంచి రెస్పాన్స్ వచ్చింది. నందు ఎలివేట్ అయ్యే రోల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే నందు తాను మరో సారి తండ్రి కాబోతుండడంతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. అలాగే ఆహా ప్లాట్ఫారం పై రీసెంట్ గా డగౌట్ అనే గేమ్ షోకి హోస్ట్ గా కూడా చేసాడు. ఈ మధ్య కాలంలో గీతా, నందు డివోర్స్ తీసుకుంటున్నారంటూ ఫేక్ న్యూస్ వైరల్ అయ్యింది. అసలే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక డివోర్స్ ఎలా తీసుకుంటాం అంటూ ఇద్దరూ ఆ న్యూస్ ని నమ్మొద్దు అని క్లారిటీ ఇచ్చారు. వధువు వెబ్ సిరీస్ లో నందు కీ రోల్ ప్లే చేశారు. ఫస్ట్ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు అసలు నందు రోల్ ఎలా మలుపు తిరగబోతోంది అనే విషయమై సెకండ్ సిరీస్ కోసం ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి ఆనందకర సమయంలో నందుకు, గీతకి విషెస్ చెప్తున్నారు నెటిజన్స్.
![]() |
![]() |